చైనాలో త్రీ చైల్డ్ పాలసీ అమలు: అసలు కారణం ఇదేనట.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన కలిగిన దేశాలలో చైనా ది మొదటి స్థానం కాగా భారత దేశం రెండో స్థానంలో ఉంది. అయితే చైనాలో త్రీ చైల్డ్ పాలసీని ప్రవేశ పెట్టడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది.
1980 సంవత్సరంలో ప్రతి వెయ్యి మందిలో 20 జననాలు నమోదయ్యే వి అదే 2016 సంవత్సరం నాటికి ప్రతి వెయ్యి మందికి 10 గా జననాలు నమోదయ్యాయి. ఇలా జన నాల స్థాయి తగ్గడం వలన 2016 వ సంవత్సరంలో టూ చైల్డ్ పాలసీని చైనా ప్రభుత్వం ప్రారంభించింది.
ప్రస్తుతము చైనా ప్రభుత్వం పొలిట్బ్యూరో అధ్యక్షుడు అయినా జిన్పింగ్ త్రీ చైల్డ్ పాలసీని ప్రవేశపెట్టారు దీనికి గల ముఖ్య కారణాలు పరిశీలించినట్లయితే
ముఖ్యంగా యువ జనాభా తగ్గిపోవడం ముసలి వాళ్ళ శాతం పెరగడం వీటి ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ పైన చూపడం వలన కొత్త పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది.
2000 సెన్సెస్ ప్రకారము 14 సంవత్సరాల లోపు గల పిల్లలు 22.8 పర్సంటేజ్ గా నమోదయింది
2010 సెన్సెస్ ప్రకారము 14 సంవత్సరాల పిల్లలు 16.6 గా నమోదయింది యుక్త వయసు గల పిల్లల శాతం తగ్గడం గమనించవచ్చు.
2000 సెన్సెస్ ప్రకారము 60 సంవత్సరాలు గల వ్యక్తులు 10 శాతంగా ఉన్నారు .
2010 సంవత్సరం నాటికి 60 సంవత్సరాలు గల వ్యక్తులు 13.26 గా నమోదు కావడం జరిగింది.
ఇలా ముసలి వాళ్ళ సంఖ్య పెరగడం యుక్తవయసు జనాభా శాతం తగ్గడం, ప్రధాన కారణంగా త్రీ చైల్డ్ పాలసీని ప్రవేశపెట్టారు.
జనాభాలోని యుక్తవయసు వారి శాతం తగ్గడం వలన అది ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపెడుతుంది. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో బాగా అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణాలు స్కిల్డ్ లేబర్ మరియు తక్కువ ఖర్చుతో పని చేయగల లేబర్ ఈ రెండు కారణాల వలన ప్రపంచంలో చైనా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ప్రముఖ స్థానంలో ఉంది .
అయితే ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ , వియత్నాం వంటి దేశాలలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లు ఎక్కువగా ప్రారంభమవుతున్నాయి దానికి కారణం యుక్త వయస్సు గల లేబర్ కలిగి ఉండడం మరియు స్కిల్డ్ లేబర్ ఉండడం వలన మాన్యుఫాక్చరింగ్ రంగం మొత్తం వేరే దేశాలకు తరలి వెళ్లి పోవడాన్ని చైనా తట్టుకోలేక పోతుంది.
చైనా ప్రజలు మాత్రం ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త సంతానం కోసం అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దానికి కారణం covid -19 వల్ల ఏర్పడిన పరిస్థితులు మరియు కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగి పోవడం వలన ప్రజలు ఎక్కువ సంతానమును కోరుకోవడం లేదు.
చైనా ప్రభుత్వం మాత్రం మూడో పిల్లవాడికి కావలసిన సదుపాయాలు అందిస్తూ ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఉచిత విద్య, వ్యాక్సినేషన్ , స్కాలర్షిప్ లాంటివి అందజేస్తూ ప్రోత్సహిస్తుంది.
US పాపులేషన్ ఎస్టిమేట్ ఆధారంగా 2030 సంవత్సరం నాటికి
చైనా అత్యధిక జనాభా స్థాయికి చేరుకుంటుంది.
అదే భారత్ 2050 సంవత్సరం నాటికి అత్యధిక జనాభా స్థాయికి చేరుకుంటుంది.
ఏది ఏమైన చైనా తీసుకున్న నిర్నయం భారత్ ను కూడ అలొచింప చేస్తుంది.
ReplyForward |
Tags:
current affairs